NZB: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మేడే వేడుకలను జయప్రదం చేయాలని IFTU జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు భూమన్న, దాసులు పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని ఎన్ఆర్ భవన్లో మేడే పోస్టర్లను ఆవిష్కరించారు. కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని, 8 గంటల పని విధానాన్ని మార్చరాదని డిమాండ్ చేశారు.