ఐపీఎల్లో అభిషేక్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. దీంతో IPL చరిత్రలో 20 బంతుల్లోపే అత్యధికంగా 6 సార్లు హాఫ్ సెంచరీలు బాదిన మొదటి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో నికోలస్ పూరన్ (4) రెండో స్థానంలో ఉండగా.. ట్రావిస్ హెడ్ (3), జేక్ ఫ్రేజర్ (3), వైభవ్ సూర్యవంశీ (3) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.