మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ లేని వాహనదారులకు జరిమానాకు బదులుగా ‘హెల్మెట్ బ్యాంక్’ ద్వారా శిరస్త్రాణాలు అందజేశారు. ప్రాణనష్టంపై అవగాహన కల్పిస్తూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని ఎస్సై సూచించారు.