MDK: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి పేర్కొన్నారు. మనోహరాబాద్ మండలం కోనాయపల్లి (పిటి) లో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తున్నట్లు వివరించారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లను అందజేయడం ప్రభుత్వ లక్ష్యం అన్నారు.