TG: పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చే చట్టాన్ని కాంగ్రెస్ తెచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. దేశంలోనే రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన తొలిపార్టీ కాంగ్రెస్ అని కొనియాడారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి రైతులకు నీరిచ్చిందని తెలిపారు. దేశమంతా రైతులకు కాంగ్రెస్ రూ.72 వేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఏడాదిలోపే చేసి చూపించామని వెల్లడించారు.