హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ అవినాష్ కుమార్ రాణిగంజ్, కర్బలా జంక్షన్లను సందర్శించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించి, వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా జంక్షన్ల అభివృద్ధిపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వాహనదారుల సౌకర్యార్థం & మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ కోసం ఈ చర్యలు తీసుకుంటున్నారన్నారు. రహదారి భద్రతను పెంపొందించడమే ఈ పర్యవేక్షణ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.