NGKL: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వన మహోత్సవంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఈ ఏడాది 12 లక్షల 71 వేల మొక్కలు నాటడమే లక్ష్యమని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో చిత్తడి నేలలు, డీమ్డ్ ఫారెస్ట్ అంశాలపై కూడా చర్చించారు. ప్రతి శాఖ సమన్వయంతో పనిచేస్తూ లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.