BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలో గత వారం సైడ్ కాలువలోని మట్టిని పూడిక తీసి బయటకు పడవేయడంతో అక్కడక్కడ మురుగు నీళ్లు నిలిచి విపరీతమైన దోమలు పెరిగాయి. దీంతో గ్రామ ప్రజలందరూ దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే గ్రామ సర్పంచ్ స్పందించి దోమల మందు స్ప్రే చేపించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.