MLG: గోవిందరావుపేట (M) సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న బ్రిడ్జి వద్ద స్థానిక చికెన్ షాప్ నిర్వాహకులు చికెన్ వ్యర్ధాలను పడవేస్తున్నారు. దీంతో రహదారిపై పందులు స్వైర విహారం చేస్తున్నాయి. అలాగే చికెన్ వ్యర్థాల వల్ల వచ్చే దుర్గంధం వల్ల మార్గంలో ప్రయాణించే వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు.