WGL: జిల్లాలో మహిళా కాంగ్రెస్ నాయకులతో కాంగ్రెస్ భవన్లో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బసవరావు సారయ్య మాట్లాడుతూ.. మహిళల సాధికారతకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని తెలిపారు. మహిళలకు రాజకీయ, ఆర్థిక రంగాల్లో సముచిత అవకాశాలు కల్పించేందుకు పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు పాల్గొన్నారు.