SRCL: వేములవాడ పట్టణ ముఖచిత్రాన్ని మార్చేయడమే ధ్యేయంగా మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు క్షేత్రస్థాయిలో వేగంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను స్ఫూర్తిగా తీసుకున్న ఆయన శనివారం తన సొంత వార్డు అయిన 15వ వార్డులో పారిశుధ్య పనులను స్వయంగా పర్యవేక్షించి యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు.