NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల భద్రత కోసం ప్రత్యేక ఇంజనీర్లు కొండ ప్రాంతాన్ని పరిశీలించారు. రాళ్లు జారిపడకుండా ఇప్పటికే చర్యలు చేపట్టిన ఆలయ యంత్రాంగం, మరింత లోతైన అధ్యయనం కోసం ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్’ బృందాన్ని ఆహ్వానించింది. ఈవో శీనా నాయక్ ఆధ్వర్యంలో రాళ్ల స్థిరత్వంపై సర్వే నిర్వహించారు.