KMM: జిల్లాలో ఇంటర్మీడియట్ MPHW(F), MLT ఒకేషనల్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ఏడాదిపాటు క్లినికల్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె.రవిబాబు తెలిపారు. తిరుమలాయపాలెం, సత్తుపల్లి, మధిర ఏరియా ఆసుపత్రుల్లో 30 మంది చొప్పున, వైరాలో 10 మందికి అవకాశం కల్పించనున్నారు. ఆసక్తి గల వారు ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 25 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.