VSP: మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 320 కోట్ల ఆదాయం సాధించింది. రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిన సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికారులను అభినందించారు. ప్రాంతంలో రియల్ ఎస్టేట్, ఐటీ అభివృద్ధితో లావాదేవీలు పెరిగినట్లు తెలిపారు. ఐటీ, టూరిజం, హైరైజ్ భవనాలు, విల్లాల నిర్మాణాలే ఈ ఆదాయ వృద్ధికి నిదర్శనమని అన్నారు.