SRH స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ ఐపీఎల్లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. CSKతో మ్యాచ్‌లో 59 పరుగులు చేశాడు. ఈ క్రమంలో IPLలో బంతుల పరంగా అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా అభిషేక్ నిలిచాడు. అతడు 1193 బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకోగా, ఆండ్రీ రస్సెల్ (1120 బంతులు) ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.