సర్ధార్ వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి గౌతు లచ్చన్న. లచ్చన్న సాహసానికి మెచ్చి ప్రజలిచ్చిన కితాబే సర్దార్. వి.వి.గిరి, నేతాజి సుభాష్ చంద్రబోస్, ఆచార్య గోగినేని రంగా మొదలగు అనేకమంది జాతీయ నాయకులతో కలిసి దేశ స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని, అనేక పర్యాయాలు జైలుకు వెళ్ళాడు. ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలో పదవి నిర్వహించారు.