AP: గుంటూరు జిల్లా వైకుంఠపురంలో రైతులు ఏర్పాటు చేసిన ధన్యవాద సభలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వైకుంఠపురం వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని TTDకి ఇచ్చే అంశంపై CMతో చర్చిస్తా. ప్రపంచంలో టాప్5 రాజధానుల్లో అమరావతి ఉండాలనేదే సీఎం లక్ష్యం. అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిని నిర్మిస్తున్నాం. కొత్తగా భూసేకరణ చేస్తున్న చోట అన్ని సదుపాయాలు కల్పిస్తాం’ అని అన్నారు.