AP: మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు ఇవాళ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. టీడీపీ నాయకులకు నిర్వహించే శిక్షణ తరగతుల్లో సీఎం పాల్గొననున్నారు. అనంతరం ప్రజల నుంచి వినతులు తీసుకోనున్నారు. మధ్యాహ్నం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, అనుబంధ రంగాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.