ASF: మైనర్లకు బైక్, కార్లు ఇచ్చి రోడ్డుపైకి పంపితే తల్లిదండ్రులు, వాహన యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కౌటాల ఎస్సై చంద్రశేఖర్ హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, ప్రమాదాలు జరిగితే బాధ్యత తల్లిదండ్రులదేనని స్పష్టం చేశారు. బైక్ వేగంగా నడపడం, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.