NLR: కావలి పట్టణంలో అక్రమ లేఅవుట్లపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. గురువారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కొల్లి శ్రీనివాసరావు పర్యటించి 2019–2024 మధ్య జరిగిన రియల్ ఎస్టేట్ వ్యవహారాలను పరిశీలించారు. వాగులు, చెరువులు, శ్మశానాల కబ్జాలను గుర్తించి విముక్తి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారుల రాకతో అక్రమదారులు అప్రమత్తమయ్యారు.