NRPT: పెద్దజట్రం పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. హెచ్ఎం గౌరమ్మ మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో సమయం వృథా చేయకుండా గణితంపై పట్టు సాధించాలని సూచించారు. ఎండల కారణంగా పిల్లల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు కోరారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.