E.G: రాజమండ్రి నగరపాలక సంస్థ ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ సాధించిన ఈ విజయానికి కమిషనర్ రాహుల్ మీనా గురువారం విజయవాడలో ప్రశంసలు అందుకున్నారు. పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్, సీడీఎంఏ సంపత్ కుమార్ చేతులమీదుగా ఆయన జ్ఞాపికను స్వీకరించారు.