ASR: జనగణన-2027 ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వీయ గణన విధానంపై జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల వారికీ అవగాహన కల్పించాలని కలెక్టర్ నిషాంతి అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె స్వయంగా తన వివరాలను నమోదు చేసి అప్లోడ్ చేసుకున్నారు. మొబైల్ ఫోన్లో సెన్సెస్ యాప్లో ఎలా అప్లోడ్ చెయ్యాలో జిల్లా అధికారులందరికి చూపించి, అవగాహన కల్పించారు.