TG: రైతు భరోసా రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 20న భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధులు విడుదల చేయనున్నారు. రెండో విడతలో 1నుంచి 5 ఎకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ. 6 వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. కాగా, తొలి విడతలో ఎకరంలోపు ఉన్న రైతులకు డబ్బులు జమ అయిన విషయం తెలిసిందే.