SKLM: వేసవి నేపథ్యంలో ఎండలు తీవ్రత పెరుగుతున్న తరుణంలో శీతల పానీయాలకు స్థానికంగా తయారు చేసే బాదంపాలకు అత్యధిక డిమాండ్ ఉంటుందని వీటిని సరైన పద్ధతిలో తయారు చేయాలని ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారి జి. శ్రీరాములు పిలుపునిచ్చారు. శనివారం టెక్కలి మేజర్ పంచాయతీ పరిధిలో పలు బాదం పాలు తయారీ యూనిట్లను పరిశీలించారు.