SRPT: విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన నూతనకల్ కానిస్టేబుల్ సోమాని నాయక్ కుటుంబానికి రూ. కోటి ఇన్స్యూరెన్స్ చెక్కును ఈరోజు ఎస్పీ నర్సింహ అందజేశారు. ఎస్బీఐ ‘పోలీస్ సాలరీ ప్యాకేజీ’ ద్వారా ఈ ఆర్థిక సాయం అందింది. పోలీస్ సిబ్బంది కుటుంబాలకు ఈ పథకం అండగా ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. బ్యాంక్ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.