BDK: యాసంగి ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ వేణుగోపాల్ శనివారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. రైస్ మిల్లర్లు, ఎఫ్సీఐ అధికారులతో ఆయన మాట్లాడారు. కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, అప్రమత్తంగా చేపట్టాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా పక్కాగా దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ విద్య చందన పాల్గొన్నారు.