KMM: జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ఖమ్మం అర్బన్ మండలంలో అత్యధికంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మధిర, కల్లూరు మండలాల్లో 41.6 డిగ్రీలు నమోదవగా, కల్లూరు, రఘునాథపాలెం, ఏన్కూర్ ప్రాంతాల్లో 41.4 నుంచి 41.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెనుబల్లి, కొణిజర్ల, వేంసూరు మండలాల్లో 41.2 నుంచి 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.