MNCL: లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని అన్ని మండలాల్లో ప్రజల పక్షాన సమస్యలపై పోరాడుతామని లక్షెట్టిపేట నియోజకవర్గ సాధన సమితి నాయకులు స్పష్టం చేశారు. శనివారం లక్షెట్టిపేట పట్టణంలోని స్థానిక ఐబీలో వారు విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డీలిమిటేషన్, మహిళా బిల్లు వీగిపోవడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.