MHBD: తొర్రూర్ పట్టణంలో మీడియా సమావేశంలో కాంగ్రెస్ మండల బ్లాక్ అధ్యక్షురాలు పింగిలి ఉషా శనివారం మాట్లాడారు. పాలకుర్తి నేతలు కాకిరాల హరిప్రసాద్, కిషోర్ రెడ్డిలపై తీవ్ర విమర్శలు చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డిపై కావాలని నిందలు వేస్తున్నారని ఆరోపిస్తూ, పార్టీకి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. అధిష్టానం తగిన వారికి బుద్ధి చెప్తుందని హెచ్చరించారు.