KMM: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా రైతులను విస్మరించిందని ఎమ్మెల్సీ తాతా మధు విమర్శించారు. గురువారం ఖమ్మంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడారు. రాష్ట్రంలో కనీసం మక్కలు, ధాన్యం కొనే నాథుడే కరువయ్యారని, కొనుగోలు కేంద్రాలను సక్రమంగా నిర్వహించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. సీఎం రేవంత్ తెలంగాణ వ్యతిరేకి అని అన్నారు.