TG: ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక విజ్ఞప్తి చేశారు. కార్మికులు ఎవరూ ఆవేదనతో తొందరపడి ప్రాణాలు తీసుకోవద్దని కోరారు. వారి సమస్యలు, డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని.. కార్మికుల సంక్షేమంతో పాటు ప్రయాణికుల సౌకర్యం తమకు ముఖ్యమని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, కార్మికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.