సన్ రైజర్స్ హైదరాబాద్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్‌కు మద్దతు పెరుగుతోంది. ప్యాట్ కమిన్స్ జట్టులోకి తిరిగి వచ్చినప్పటికీ.. కిషన్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని మాజీ క్రికెటర్లు సంజయ్ బంగర్, హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. జట్టులో కిషన్‌కు మంచి సమన్వయం ఉందని, యువ కెప్టెన్‌ను ప్రోత్సహిస్తే జట్టుకు మేలు జరుగుతుందని వారు విశ్లేషించారు.