NLG: నల్గొండ మండలం కొత్తపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఇవాళ పోషణ్ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం, పరిశుభ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ICDS సూపర్వైజర్ శ్యామల, సర్పంచ్ రేణుక రాజు, సెక్రటరీ ప్రియాంక, టీచర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.