AP: రాష్ట్రంలో ఎండలు తీవ్రమవుతున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. రేపు 62 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం సహా పలు జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. వృద్ధులు, అనారోగ్య సమస్యలున్న వారు ఎండలో తిరగవద్దని సూచించారు. అలాగే, ఆకస్మికంగా ఉరుములతో కూడిన వర్షాల వేళ చెట్ల కింద ఉండవద్దని అప్రమత్తం చేశారు.