SS: ధర్మవరం మార్కెట్ యార్డులోని ఈవీఎం గోడౌన్ను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గురువారం తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి త్రైమాసిక తనిఖీ నిర్వహించి, గోడౌన్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈవీఎంల భద్రతపై ఎలాంటి రాజీ పడకూడదని, 24 గంటల నిఘా కొనసాగించాలని అధికారులకు సూచించారు.