TG: మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నల్గొండలో జరిగింది. ప్రభుత్వం వైఖరికి నిరసనగా పెట్రోల్ పోసుకున్నాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన తోటి ఆర్టీసీ ఉద్యోగులు అడ్డుకున్నారు. బాధితుడు మిర్యాలగుడ డిపోకు చెందిన డ్రైవర్ వెంకన్న అని ఉద్యోగులు తెలిపారు. కాగా, ఇప్పటికే వరంగల్ జిల్లా నర్సంపేట డిపోలో ఓ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే.