VZM: గజపతినగరం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన 50 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య సమక్షంలో వైసీపీలో చేరారు. టీడీపీ, జనసేన పార్టీలను వీడి వచ్చిన వారికి ఆయన పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, జడ్పీటీసీ గార తవుడు పాల్గొన్నారు.