విశాఖ పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో 44వ అఖిల భారత ప్రధాన పోర్టుల బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్ సాలిగ్రాంపురంలోని సాగరమాల కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరంజి కొరాటి పోటీలను ప్రారంభించారు. వివిధ ప్రధాన పోర్టుల జట్లు పాల్గొంటున్న ఈ పోటీల్లో క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో పోటీ పడాలన్నారు.