దేశంలో ఐదేళ్లలో అత్యంత సంపన్న వ్యక్తుల (UHNWI) సంఖ్య 25,217కు, బిలియనీర్ల సంఖ్య 313కు పెరగొచ్చని స్థిరాస్తి కన్సల్టెంట్ నైట్‌ఫ్రాంక్ అంచనా వేసింది. 30 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.270 కోట్లు), అంతకంటే ఎక్కువ నికర ఆస్తి కలిగిన వారిని UHNWIలుగా, రూ.9300 కోట్ల కంటే అధిక సంపద కలిగిన వారిని బిలియనీర్‌గా పరిగణిస్తారు. దేశంలో 19,877 మంది UHNWIలు, 207 మంది బిలియనీర్లు ఉన్నారు.