VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మెయిన్ గేట్ వద్ద నూతన ఫౌంటైన్ను వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ ప్రారంభించారు. రంగురంగుల వెలుగుల మధ్య నీటి ధారలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. విద్యుత్ దీపాల అలంకరణతో వర్సిటీ ప్రాంగణం సరికొత్త శోభను సంతరించుకుంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ పి. కింగ్, రిజిస్ట్రార్ కె. రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.