NRPT: మిషన్ భగీరథ పైప్లైన్ మరమ్మతుల కారణంగా నారాయణపేట,దామరగిద్ద మండలాల్లోని 60 గ్రామాలకు నేటి నుంచి 27 నా ఉదయం వరకు నీటి సరఫరా నిలిచిపోనుంది. బొమ్మన్పాడు, వత్తుగుండ్ల ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయని, ప్రజలు సహకరించాలని ఈఈ శ్రీనివాస్ కోరారు. మరమ్మతులు పూర్తికాగానే నీటిని పునరుద్ధరిస్తామని ఆయన తెలిపారు. ప్రజలు నీటిని నిల్వ చేసుకోవాలని సూచించారు.