SRCL: ఎల్లారెడ్డిపేట మండలంలోని పదిర వాగు నుంచి 45 ట్రాక్టర్లకు అనుమతి పొంది ఇసుక రవాణా చేస్తున్నట్లు తహశీల్దార్ సుజాత తెలిపారు. ఇసుక తరలింపులో ఎలాంటి అక్రమాలు జరగకుండా రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రావణ్ గౌడ్ తన సిబ్బందితో కలిసి గురువారం పదిర ఇసుక రీచ్ వద్ద పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇసుక కావాల్సిన వారు ‘మన ఇసుక రవాణా’ యాప్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నారు.