ATP: అనంతపురం కక్కలపల్లి మార్కెట్లో మామిడి ధరలు భారీగా పెరిగాయి. ఐదు రోజుల కిందటే అమ్మకాలు ప్రారంభం కాగా, ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు తగ్గడంతో మార్కెట్లో నిల్వలు పెరిగాయి. అయితే, గురువారం నుంచి ధరల్లో అనూహ్య పెరుగుదల కనిపించింది. క్రితం రోజు గరిష్ఠంగా రూ.48 వేలు పలికిన టన్ను ధర, తాజాగా ఏకంగా రూ.65 వేలకు చేరింది.