ASR: ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని కొయ్యూరు ఎస్సై కిషోర్ వర్మ సూచించారు. గురువారం రాత్రి నడింపాలెం గ్రామంలో పర్యటించి గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అవగాహన కల్పించారు. డ్రైవర్లు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. కారులో ప్రయాణిస్తున్న వాళ్లు సీటు బెల్ట్ ధరించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడపకూడదన్నారు.