BDK: ఆస్ట్రేలియా, జర్మనీ, ఒమన్ దేశాల్లో ఉద్యోగాల కోసం ఐటీడీఏ దరఖాస్తులు కోరుతున్నట్లు గురువారం పీవో బి. రాహుల్ తెలిపారు. పెయింటర్, మెకానిక్, వెల్డర్, నర్సు పోస్టులకు ఏడాదికి రూ. 24 లక్షల నుంచి రూ. 48 లక్షల వరకు వేతనం ఉంటుందని అన్నారు. అర్హత గల అభ్యర్థులు పాస్పోర్ట్, విద్యార్హత పత్రాలతో ఈనెల 27, 28 తేదీల్లో ఐటీడీఏలోని ‘భవిత సెల్’లో సంప్రదించాలని అన్నారు.