NZB: జక్రన్ పల్లి సెక్టార్లో ఎంపీడీవో కార్యాలయంలో పోషణ పక్షం భాగంగా సామూహిక సీమంతాలు, అన్నప్రాసన కార్య క్రమం నిర్వహించారు. డీఎల్పీఓ శివ, ఎమ్మార్వో, ఎంపీడీవో పాల్గొని పోషకాహారం ప్రాముఖ్యతను వివరించారు. పిల్లల ఆరోగ్య కర అభివృద్ధికి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.