BHPL: కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయ 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులతో ప్రతి కుటుంబం ఆనందంగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.