KNR: అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా డి. శ్రీనివాస్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు రేరాలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఆయనను ఇటీవల కరీంనగర్ అడిషనల్ కలెక్టర్గా నియమించింది. ఈ నేపథ్యంలో గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను ఆయన మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.