BDK: పినపాక మండలంలోని గోపాలరావుపేటలో జిల్లా కలెక్టర్ అంకిత్ పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరతపై గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సివిల్ సప్లై డీటీ శివకుమార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.